English

ఆర్గానోగ్రామ్

 

మౌలిక సదుపాయాల నిర్మాణం

ఒక సంస్థ యొక్క విజయమూ, అభివృద్ధి , పేరు ప్రఖ్యాతులు నాణ్యమైన, అత్యుత్తమ విత్తనాలు అందించడం, తద్వారా చక్కని వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించడం పైనే ఆధారపడి ఉంటుంది. కారణం పంట ఉత్పత్తిలో విత్తనాల నాణ్యత కీలక పాత్ర వహిస్తుంది కనుక.

అలాగే

* అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అధిక దిగుబడునిచ్చే అనేక రకాల ఉత్పత్తులను (Varieties & Hybrids) అందించడం.

* ఆ సంస్థలోని ప్రఖ్యాత వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు.

* తగిన విద్యార్హతలు అవగాహన, అనుభవం కలిగిన ఉద్యోగ సిబ్బంది వారి సహాయ సహకారాలు . ఇవన్నీ సంస్థ అభివృద్ధికి, ఆ సంస్థ దినదినప్రవర్ధమానంగా వెలుగొందడానికి తోడ్పడతాయి.

అటువంటి అన్ని అర్హతలు కల్గిన NRI Agritech Pvt Ltd., సంస్థ వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసిన గుంటూరు మహానగరం కేంద్రంగా ఏర్పడింది .

మా సంస్థ ప్రత్యేకతలు -ప్రధాన లక్ష్యాలు

  • మోడల్ ప్రాసెసింగ్ ప్లాంటును స్థాపించడం ద్వారా నాణ్యమైన విత్తనాలు అందించడం, భద్రత కల్పించడం.
  • అన్ని ఋతువులలోను అన్ని రకాల విత్తనాలు లభ్యమయ్యేలా నిల్వ ఉంచడం.
  • నాణ్యత కలిగిన హైబ్రిడ్ మరియు మేలు జాతి రకాల విత్తనాలను, మొక్కలను అందించడం.
  • వాణిజ్య పంటలకు అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్దతులను ప్రోత్సహించడం .
  • ఔత్సాహిక యువ రైతులను ప్రోత్సహించడం.
  • గ్రామీణ ప్రాంతాల వారికి ఉద్యోగ అవకాశాలను, భద్రతను, కల్పించడం .

NRI Agritech సందర్శించిన ప్రముఖులు:

  • 2009 వ సం || జనవరి 26 వ తేదీన భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ శ్రీ అబ్దుల్ కలాం గారు NRI అగ్రిటెక్ కాజాలోని వ్యవసాయ క్షేత్రములో నిర్వహించబడిన వ్యవసాయ ప్రదర్శనను సందర్శించారు.
  • 2010 వ సం || లో ఆచార్య ఎన్.జి . రంగా అగ్రికల్చర్ విశ్వవిద్యాలయ (ANGRU) మాజీ వైస్ ఛాన్సలర్ డా. ఎ అప్పారావు గారు నిడుముక్కలలోని R & D వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు.
  • 2009 వ సం || లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య కార్యదర్శి శ్రీ కాకి మాధవరావు (IAS), నిడుముక్కలలోని R & D వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు.
  • 2015 వ సం || జనవరి 15న ప్రస్తుత పోస్ట్ ట్రస్ట్ శ్రీ కృష్ణబాబు (IAS) గారు "బుష్ డోలిచోస్" రకమైన "గణేష్" ను సందర్శించారు.
  • 2014 వ సం || డిసెంబర్ 20 వ తేదీన డా|| కె కృష్ణ కుమార్ DDG Hort ( ICAR ) గారు R & D వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు.
  • 2015 వ సం || జనవరి 9 న డా|| టి జానకిరామ్, ADG Hort (ICAR) గారు R & D వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు.
  • 2010 వ సం ||లో డా|| వైయస్ఆర్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| శిఖామణి గారు, R & D వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు.
  • 2014 వ సం || డిసెంబర్ 18, 20 వ తేదీలలో మరియు 2015 వ సం || ఫిబ్రవరి 13 వ తేదీన డా|| వైయస్ఆర్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| బి.ఎం.సి. రెడ్డి, వైస్ ఛాన్సలర్ గారు సందర్శించారు.
  • 2014 వ సం || జనవరి 12వ తేదీన మాజీ DDG (Hort) ICAR మరియు JNKVV, జబల్పూర్ వైస్ ఛాన్సలర్ శ్రీ డా|| గౌతమ్ కల్లోడ్, సందర్శించారు.
  • 2014 వ సం || డిసెంబర్ 5 మరియు 6 తేదీలలో JNKVV, జబల్పూర్ నందలి డీన్ ఫాకల్టీ, డా||ఎస్. కె. రావు గారు, గూడవల్లి మరియు నిడుముక్కలలో వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు.
  • 2014 వ సం || డిసెంబర్ 5 మరియు 6 తేదీలలో BISA (CYMMYT) ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ గారైన డా రాజ్ గుప్తా గారు సందర్శించారు.
  • 2015 వ సం || జనవరి 2న సీనియర్ సైంటిస్ట్ (Pigeon Pea Breeding) ICRISAT డా|| సి సమీర్ కుమార్ గారు సందర్శించారు.
  • 2014 వ సం || నవంబర్ 17వ తేదీన వ్యవసాయ శాఖా మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు కొలకులూరు లో మినుము పంటకు సంబంధించి 'SRI' ఫీల్డ్ ను సందర్శించారు.
  • 2015 వ సం || జనవరి 21 వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డా|| కోడెల శివప్రసాద రావు గారు ' డెల్టా ' వరి రకాన్ని పరగాటిచెల వద్ద సందర్శించారు.

 

2008 వ సం || నుండి సంస్థ ఆరంభించినప్పటి నుండి NRI అగ్రిటెక్ యొక్క ప్రచురణల జాబితా

  • ఎ సత్యనారాయణ, 2014 "Developing Dolichos Beans for round the year cultivation". 11-01-2014 న ఆంధ్రప్రదేశ్, గుంటూరులో జరిగిన జాతీయ సదస్సులో Developing of Vegetable varieties for round the year Cultivation, పై పత్ర సమర్పణ; P:1-4.
  • ఎ.సత్యనారాయణ, ఎ రామకృష్ణ, ఎ.గోపి, పి.ప్రసాద రావు, M.P., రామయ్య , K.S.V మరియు మాధవరావు, 2014.Studies on the Inheritance of Plant habit and photo insensitivity in garden bean Dolichos Lablab var. Typicus (Syn Lablab purpurians var.typicus)
  • 11-01-2014 న ఆంధ్రప్రదేశ్, గుంటూరు లో జరిగిన జాతీయ సదస్సులో "Developing of Vegetable, Varieties for round the year Cultivation (ఆంధ్రప్రదేశ్ సంవత్సరం పొడవునా సాగుకోసం కూరగాయల రకాల అభివృద్ధి ) అనే అంశం పై పత్రాల సమర్పణ P : 14-16.
  • ఏ .సత్యనారాయణ, 2013. Reverse Breeding a new concept to develop varieties from Hybrid. 2013 వ సంవత్సరంలో వారణాసిలో జరిగిన జాతీయ సింపోజియంలో "Abiotic and Biotic stress management in vegetable crops" అనే అంశం పై పత్ర సమర్పణ.
  • ఏ. సత్యనారాయణ , 2013 "Chickpea in Andhra Pradesh Milestones in the Adaptation process of Short duration Varieties leading to Silent revolution" అనే అంశం పై 11-01-2013 న ICRISAT, హైదరాబాద్ లో నిర్వహించబడిన సెమినార్.
  • ఏ. సత్యనారాయణ 2012 "New plant types in major crop plants for breaking yield barries" 11-01-2012 న గుంటూరులో జరిగిన "Future farming" అనే అంశం పై జరిగిన ఒక్క రోజు సెమినార్ లో పత్ర సమర్పణ P:4
  • ఏ. సత్యనారాయణ 2014 'శక్తి' పెసర రకము పంటకు పూర్వ వైభవము తీసుకురాగలదా " రైతునేస్తం - 10(2):25-26 (TELUGU).
  • ఏ. సత్యనారాయణ 2014 "బంగారు తెలంగాణా నవ్యాంధ్ర ప్రదేశ్ లలో వ్యవసాయాభివృద్ధికి ఆచరించవలసిన వ్యూహాలు "రైతు నేస్తం" 9(12)" 27-28 [Telugu ].
  • ఏ. సత్యనారాయణ 2009 "Scope for increasing the genetic potential in leguminous vegetables" 2011వ సంవత్సరంలో IIHR బెంగుళూర్ లో జరిగిన బ్రెయిన్ స్ట్రోమింగ్ సమావేశంలో "Leguminous Vegetables " అనే అంశం పై లీడ్ పేపర్ సమర్పణ.
  • ఏ.సత్యనారాయణ , 2013 "Conventional Plant Breeding" (సంప్రదాయ మొక్కల పెంపకం) . 23-02-2013 న ఎస్ . వి . అగ్రికల్చర్ కాలేజీ, తిరుపతి ANGRAU నందు అనుబంధ ఉపన్యాసం .

 

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ . సత్యనారాయణ గారు పాల్గొన్న సెమినార్లు వర్క్ షాప్ లు మరియు సింపోనియా

  • * వరి పై AICRP యొక్క గ్రూపు సమావేశం జరిగింది .
  • 2012 లో హైదరాబాద్ లో ICICRISAT సమయంలో జరిగిన 'లిటిల్' నో వెజటేబుల్ క్రాప్స్ పై అంతర్జాతీయ సింపోజియం
  • * 15-11-2012 న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన "Comprehensive Chick Pea Adaptation and impact study" పై జరిగిన సమీక్ష లో (TL -2) లో పాల్గొన్నారు.
  • Group meeting of AICRP on Tropical fruits held at Dr.YSR Horticulture University, VR Gudem on 18-02-2013 and chaired a session on Plant Genetic Resources.
  • 10-11, ఏప్రిల్, 2012 మధ్యకాలంలో భారతదేశంలో మెరుగైన Chick pea సాగు మరియు Pigeon Pea సాగులను ట్రాక్ చేయడం ' అనే అంశం పై TRIVSA ప్రాజెక్ట్ వర్క్ షాప్ లో పాల్గొన్నారు .
  • 04-10-2013 న బెంగళూరు లోని II HR వద్ద 'డబుల్ హా ప్లోయిడ్స్ : స్కోప్ & ఫ్యూచర్ ఇన్ హార్టికల్చర్ క్రాప్స్ ' అనే సమావేశానికి అధ్యక్షత వహించారు .
  • 03-02-2013 న జబల్పూర్ BPD JNKVV సలహా బోర్డు సమావేశంలో పాల్గొన్నారు .
  • యువ రైతుల సమావేశంలో పాల్గొని, 9-12-2013 న గుంటూరు లో భారతీయ వ్యవసాయంలో 'యువత పాత్ర ' అనే అంశం పై ఉపన్యాసం ఇచ్చారు .
  • 'అఖిల భారత కిసాన్ ' 'సభ ' సమావేశంలో పాల్గొని 19-12-2013 న Sustainable Agriculture need of the hour అనే అంశం పై ఉపన్యాసం ఇచ్చారు .

 

నిర్వహించిన సెమినార్లు మరియు సింపోనియా

  • January 11, 2014 న కూరగాయల రకాలను అభివృద్ధి చేయడం పై జాతీయ సెమినార్ నిర్వహించారు .
  • 23-02-2011 న "ఆరోగ్యం మరియు ఆనందం కోసం మీ సొంత కూరగాయలను పెంచుకోండి".
  • వ్యవసాయ శాఖ సహకారంతో, గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులందరితో పాటు ఎన్ ఆర్ ఐ పి 003 రంగానికి 27-11-2010 న R & D వ్యవసాయ క్షేత్రం, గూడవల్లి లో 500 మంది రైతులతో కలిసి సందర్శించారు.