English

నూనె విత్తనాలు

1.నువ్వులు NRI S - 001 దుర్గ
  • మద్యస్థ ఎత్తు పెరుగుతుంది. ( 115 cm)
  • 6 నుండి 8 కొమ్మలు కలిగి ఉంటుంది.
  • ఆకులు పొడవుగా మద్యస్థ వెడల్పు ఉంటాయి.
  • పూలు తెలుపు రంగులో, గంట ఆకారంలో ఉంటాయి.
  • ఆకుకు రెండు కాయలు కలిగి ఉంటుంది .
  • నలుపు రంగు విత్తనాలు కలిగి ఉంటుంది .
  • పంట కాలం 100 - 110 రోజులు.
  • అధిక దిగుబడి , నూనె శాతం కలిగి ఉంటుంది .
2.నువ్వులు NRI S 002 ప్రసాద్
  • తెలుపు రంగు గింజ రకం
  • 3 -5 కొమ్మలు కలిగి మద్యస్థ ఎత్తు రకం.
  • తెల్లని పూలు గంట ఆకారంలో ఉంటాయి.
  • ఆకు వద్ద 2 కాయలు కలిగి ఉంటుంది.
  • పంట కాలం : 90 -100 రోజులు.
  • అధిక దిగుబడి : 5 - 7 క్వింటాలు/ఎకరాకు.
3.ఆవాలు NRI M 001 స్నేహ
  • మొక్క ఎత్తుగా, అధిక కొమ్మలు కలిగిన రకం.
  • ఆకులు, కాండం ఆకుపచ్చ రంగులో వుంటాయి.
  • పూలు పసుపు రంగు కలిగి ఉంటాయి.
  • నిండు కాఫీ రంగు గింజలు.
  • నూనె శాతం - 40 %.
  • తక్కువ పంట కాలం ( 90 - 100 రోజులు).