English

NRI దోస (కనక)

అధిక దిగుబడిని ఇస్తుంది.
ఆకుమచ్చ తెగుళ్ళు సమర్థవంతంగా తట్టుకుంటుంది.
కాయ మధ్యస్తంగా , గుండ్రంగా, బంగారు పసుపు వర్ణం.
ఎక్కువ రోగీజులు నిల్వ సామర్థ్యం కలిగి దూర ప్రాంత రవాణాకు కలిగి దూర ప్రాంత రవాణాకు అనుకూలంగా ఉంటుంది.
పంట కాలం : 85-90 రోజులు ;మొదటి కోత : 55-60 రోజులు.
విత్తే సమయం :
డిసెంబరు రెండవ వారం నుండి జనవరి మూడవ వారం
జులై రెండవ వారం నుండి ఆగష్టు మొదటివారం వరకు
విత్తనాలు, విత్తడం :
250(గా - 350(గా ఎకరాకు; మొక్కకు మొక్కకు మధ్య 1.5 - 2 అడుగుల దూరం , వరుసకు వరుసకు మధ్య 4 అడుగుల దూరం.
4(గా ల ట్రైకోడెర్మా విరిడెను 100(గా ల విత్త నాలకు పట్టించి గంట వ్యవధి తరువాత నాటు కొనవలెను .
ఎరువుల యాజమాన్యం :
50 kg ల పొటాష్ , 30 kg ల పొస్ఫర్స్ ను దుక్కిలో వేసి కలియ దున్నాలి.
100 కేజి ల యూరియా 3 బాగాలుగా చేసి 30,45,60 రోజులలో ఇవ్వాలి.
వేసవి కాలం లో ఆడ పూల కొరకు బోరాక్స్ 4(గా/1 లీ నీటికి కలిపి స్ప్రే చెయవలెను.
సస్యరక్షణ:
మొక్క 7-10 రోజుల దశలో పెంకు పురుగు నివారణకు క్లోరి పైరిఫాస్ 2 ml/ 1l నీటికి కలిపి పిచికారి చేయాలి.
పాము పొడ అనగా ఆకుపైన చారలు గమనిస్థే కరాటే (లాంబ్డా సిహలోథ్రిన్) 2 ml/1l నీటికి కలిపి పిచికారి చేయాలి.
దోమ మరియు కాయ తొలుచు ఈగ నివారణకు ఇమిడాక్లోప్రిడ్ పిచికారి చేయాలి.
ఆకు మచ్చ తెగుళ్ళ కొరకు కార్బెండజిమ్ లేదా టెబ్యుకొనజొల్ (నెటివో) పిచికారి చేయాలి.

పోషక విలువలు
  • 100 గ్రాముల దోస కాయలో
  • పిండి పదార్దాలు 15.60 g
  • మాంసకృతులు 0.369 g
  • పీచు పదార్దాలు 1.340 g
  • కొవ్వులు 1.120 g
  • ఫాస్పరస్ 0.088 mg
  • జింకు 0.203 mg
  • ఐరన్ 0.802 mg
  • కాల్షియం 0.760 mg
  • నీటి శాతం 76.93 %